బంపర్ ఆఫర్ కొట్టేసిన దేత్తడి హారిక.. ఏకంగా తెలంగాణ ప్రభుత్వంలో.. !

తెలుగు బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది దేత్తడి హారిక.. బిగ్ బాస్ లోకి వెళ్లి తన ఆటతో, అటిట్యూడ్ తో టాప్ 5వరకు వెళ్ళింది. ఇక షోనుంచి బయటకు వచ్చాక అడపాదడపా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇదిలావుండగా దేత్తడి హారికకు బంపరాఫర్ వచ్చింది..
తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌టిడిసి) బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read :
♦ ఒక్కరోజు హోంమంత్రిగా... మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం..!
♦ ఎవరీ కేశినేని శ్వేత.. ఆమె హై ప్రొఫైల్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే .. !
ఈ సందర్భంగా టిఎస్‌టిడిసి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ.. మా తెలంగాణ మహిళా, బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారిక గారిని తెలంగాణ స్టేట్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఆల్ ది బెస్ట్ హరిక. మీరు మీ పాత్రకు న్యాయం చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అన్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది హారిక.
Here we go... https://t.co/pUDLjkR2sD
— Alekhya Harika (@harika_alekhya) March 8, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com