Bio Asia 2023 : బయో ఏషియా సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సు ప్రారంభమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో మంత్రి కేటీఆర్ లాంచనంగా ప్రారంభించారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో... లైఫ్ సైన్సెస్, ఫార్మా, మెడ్‌టెక్, ఆరోగ్య సంరక్షణ రంగాలపై నిపుణుల ప్రసంగాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 2 వేలకు మందికిపైగా ప్రముఖులు హాజరయ్యారు. వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక సమావేశాలు, ప్రపంచస్థాయి నిపుణులతో చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్స్, సీఈవో కాంక్లేవ్, స్టార్టప్ షోకేస్, బయోపార్క్ సందర్శనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి.
రెండ్రోరోజు లైఫ్‌సైన్సెస్, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తారు. చివరిరోజు వివిధ కంపెనీలకు చెందిన ప్రదర్శన ఉంటుంది. జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు. భారత్‌లోని లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ సదస్సు చక్కని వేదికగా ఉపయోగపడుతున్నది. అలాగే, పెట్టుబడుల ఆకర్షణకు కూడా ఇది దోహదపడుతున్నది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, నోవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com