Telangana : తెలంగాణలో విస్తరించనున్న బయోలాజికల్ - ఇ కంపెనీ

Telangana : తెలంగాణలో విస్తరించనున్న బయోలాజికల్ - ఇ కంపెనీ
X
తెలంగాణలో తమ పరిశ్రమను విస్తరించనున్నట్లు ఫార్మా దిగ్గజ సంస్థ బయోలాజికల్-ఈ ప్రకటించింది

Telangana L తెలంగాణలో తమ పరిశ్రమను విస్తరించనున్నట్లు ఫార్మా దిగ్గజ సంస్థ బయోలాజికల్-ఈ ప్రకటించింది. 1800 కోట్ల పెట్టుబడితో జీనోమ్‌ వ్యాలీలో జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్, ఎంఆర్‌, పీసీవీ, టైఫాయిడ్ టీకాల తయారీతో పాటు టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్మూలేషన్స్‌ తయారీని చేపట్టనున్నట్లు తెలిపింది.

విస్తరణ ద్వారా 2 వేల 518 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బయోలాజికల్-ఈ ఎండీ, సీఈవో మహిమ దాట్ల మంత్రి కేటీఆర్‌ను కలిసి కొత్త పెట్టుబడి, విస్తరణ అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేశారు.

బయోలాజికల్-ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే హైదరాబాద్ ప్రపంచ ఔషద రాజధానిగా ఉందన్నారు. ఏడాదికి 900 కోట్ల డోసుల సామర్థ్యంతో ప్రపంచ వ్యాక్తిన్ ఉత్పత్తిలో మూడింట ఒక వంతు తయారు చేస్తోందన్నారు.

బయోలాజికల్-ఈ పెట్టుబడులతో ఈ సామర్థ్యం 14 వందల కోట్ల డోసులు తయారు చేసే స్థాయికి చేరుతుందన్నారు. దీంతో ప్రపంచంలోనే హైదరాబాద్ అత్యంత భారీ స్థాయిలో టీకా ఉత్పత్తులు చేసే కేంద్రంగా మారుతుందన్నారు.

Tags

Next Story