BIRD FLU: బర్డ్ ఫ్లూ సోకి 3,500 నాటుకోళ్లు మృతి

నెల రోజులుగా కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా చికెన్ తినాలంటే చాలామంది భయపడుతున్నారు. వారం రోజులుగా బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ తగ్గిపోయింది. దీంతో మళ్లీ చికెన్ దుకాణాల వద్ద క్యూ పెరుగుతుంది. అయితే మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో ఏకంగా 10వేల కోళ్లు మృతిచెందడం ఆందోళన కలిగిస్తుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గ్రామాల్లో శనివారం 10వేల కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతిచెందాయి. గవ్వపల్లి, జంగరాయి గ్రామాల్లోని కోళ్ల ఫాంలలో కళ్ల ఎదుటే వ్యాధికి గురైన కోళ్లు మృతి చెందడంతో ఫాంల యాజమానులు, స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
నాటుకోళ్లు మృతి
బర్డ్ ఫ్లూ సోకి నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పాత్ లోత్ ప్రసాద్ తన పౌల్ట్రీ ఫామ్ లో గత కొన్ని సంవత్సరాలుగా నాటు కోళ్లను పెంచుతూ ఉపాధిని పొందుతున్నాడు. ఆదివారం ఉదయం పౌల్ట్రీ ఫామ్ వచ్చి చూసేవారికి కోళ్లన్నీ చిందరవందరగా చనిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి తన పౌల్ట్రీ ఫారం లో ఉన్న సుమారు 3500 నాటు కోళ్లు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే గల బాయిలర్ ఫామ్ లో బర్డ్ ఫ్లూ సోకడంతో అన్ని కోళ్లు మృతి చెందాయని, ఆ కోళ్ల ఫామ్ కు కొద్ది దూరంలోనే తన నాటు కోళ్ల ఫామ్ ఉందని తెలిపారు. బాయిలర్ కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ తన నాటు కోళ్లకు కూడా సోకి మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com