revanth: రేవంత్ కుజన్మదిన శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణలో కాంగ్రెస్ కు జవసత్వాలు అందించి.. అధికారంలోకి తెచ్చిన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి బర్త్ డే నేడు. పదునైన విమర్శలు, దూకుడు మనస్తత్వం, ఏదైనా సూటిగా చెప్పే తత్వం రేవంత్ సొంతం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా రేవంత్.. పాలనలో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి దిశగా సాగుతున్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ.. యువత భవిష్యత్తుకు హామీ ఇస్తూ రేవంత్ ముందుకు సాగుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు' సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పడంతో.. రాజకీయాలు వేడేక్కాయి. కాగా రేవంత్ రెడ్డి కి చాలా మంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ శుభాకాంక్షలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సీఎం సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రానున్న నూతన సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వాలని, ప్రజల సేవలో ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు.
రావి ఆకుపై రేవంత్ చిత్రం
రేవంత్ రెడ్డికి నారాయణఖేడ్ పట్టణానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని గుండు శివకుమార్ వినూత్నంగా రావి ఆకులు, అరటి ఆకుపై ముఖ్యమంత్రి చిత్రాలను రూపొందించారు. ఈ కళా ప్రక్రియ ద్వారా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పట్టువస్త్రంపై రేవంత్ ముఖచిత్రం
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టు వస్త్రంపై తెలంగాణ ముఖ చిత్రంలో ఆయన ఫొటో వచ్చే విధంగా సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ తయారు చేశారు. దీనిని కోసం రూ.20 వేల వరకు ఖర్చు వచ్చిందని హరిప్రసాద్ తెలిపారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా అవకాశం కల్పిస్తే ఈ పట్టు వస్త్రాన్ని ఆయనకు కానుకగా అందిస్తానన్నారు. దాదాపు ఐదు రోజులపాటు శ్రమించి ఈ వస్త్రాన్ని తయారు చేశానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com