BJP: బీజేపీలోకి 5మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

BJP: బీజేపీలోకి 5మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
X
బాంబు పేల్చిన తెలంగాణ బీజేపీ చీఫ్.. 5మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వెల్లడి.. త్వరలోనే ఎమ్మెల్యేలు ఎవరో చెప్తామని వెల్లడి.. సంచలనంగా రాంచందర్‌రావు వ్యాఖ్యలు

తె­లం­గాణ బీ­జే­పీ అధ్య­క్షు­డు రాం­చం­ద­ర్ రావు బాం­బు పే­ల్చా­రు. బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­కి చెం­దిన ఐదు­గు­రు ఎమ్మె­ల్యే­లు బీ­జే­పీ­లో చే­రేం­దు­కు తమతో టచ్‌­లో ఉన్నా­ర­ని వె­ల్ల­డిం­చా­రు. ఆ ఎమ్మె­ల్యే­లు ఎవ­ర­నే­ది త్వ­ర­లో వె­ల్ల­డి­స్తా­న­ని రాం­చం­ద­ర్ రావు చే­సిన వ్యా­ఖ్య­లు ఇప్పు­డు తీ­వ్ర సం­చ­ల­నం­గా మా­రా­యి. ఆ ఎమ్మె­ల్యే­లు.. మా పా­ర్టీ­లో చేరే తే­దీ­లు సైతం తె­లి­య­జే­స్తా­మ­ని చె­ప్పా­రు. బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ నా­య­క­త్వం­పై నమ్మ­కం లేక తమ వైపు వారు చూ­స్తు­న్నా­ర­ని పే­ర్కొ­న్నా­రు. అయి­తే ఆ పా­ర్టీ నుం­చి ఐదు­గు­రు ఎమ్మె­ల్యే­లే కా­ద­ని.. ఆ సం­ఖ్య మరింత పె­రి­గే అవ­కా­శ­ముం­ద­న్నా­రు. ఆగ­స్ట్ 10వ తే­దీన బీ­జే­పీ­లో అచ్చం­పేట మాజీ ఎమ్మె­ల్యే గు­వ్వల బా­ల­రా­జు చే­ర­ను­న్నా­ర­ని తె­లి­పా­రు. బీ­జే­పీ­లో చే­రి­క­ల­కు ఇది ఆరం­భం మా­త్ర­మే­న­ని స్ప­ష్టం చే­శా­రు. స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ముం­దు ఇలా పా­ర్టీ­లో చేరే వారి సం­ఖ్య భా­రీ­గా పె­రు­గు­తుం­ద­ని ఆయన జో­స్యం చె­ప్పా­రు. ఫోన్ ట్యా­పిం­గ్‌ కే­సు­ను సీ­బీ­ఐ­కి అప్ప­గి­స్తే­నే అసలు దో­షు­లు బయ­ట­కు వస్తా­ర­ని ఆయన అభి­ప్రా­య­ప­డ్డా­రు. ఓటమి భయం­తో­నే ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­కు వె­ళ్ల­డం లే­ద­న్నా­రు. అయి­తే ఓట­ర్ల జా­బి­తా అం­శం­పై కాం­గ్రె­స్ పా­ర్టీ అగ్ర­నేత రా­హు­ల్ గాం­ధీ చే­సిన వ్యా­ఖ్య­లు అయన అస­హ­నా­ని­కి పరా­కా­ష్ట­గా తె­లం­గాణ బీ­జే­పీ చీఫ్ అభి­వ­ర్ణిం­చా­రు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

విలీనం వార్తల వేళ వ్యాఖ్యలు

బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­ని బీ­జే­పీ­లో వి­లీ­నం చే­స్తా­రం­టూ ఒక చర్చ అయి­తే రా­జ­కీయ వర్గా­ల్లో చర్చ నడు­స్తుం­ది. అం­తే­కా­దు.. అం­దు­కు సం­బం­ధిం­చిన ఓ ఆడి­యో సైతం సో­ష­ల్ మీ­డి­యా­లో వై­ర­ల్‌­గా మా­రిం­ది. సరి­గ్గా అలాం­టి వేళ.. బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­కి చెం­దిన ఇద్ద­రు మాజీ ఎమ్మె­ల్యే­లు గు­వ్వల బా­ల­రా­జు, అబ్ర­హం.. ఇప్ప­టి­కే ఆ పా­ర్టీ­కి గుడ్ బై చె­ప్పా­రు. వా­రి­ద్ద­రు బీ­జే­పీ­లో చే­రేం­దు­కు ము­హూ­ర్తం ఖా­ర­రై­న­ట్లు తె­లు­స్తోం­ది. మరో­వై­పు బీ­సీ­ల­పై కాం­గ్రె­స్ పా­ర్టీ­కి ఏ మా­త్రం చి­త్త­శు­ద్ధి లే­ద­ని.. ఒక­వేళ ఉంటే బీసీ రి­జ­ర్వే­ష­న్ల­లో ము­స్లిం­ల­ను చే­ర్చ­కుం­డా కేం­ద్రా­ని­కి 42 శాతం బీసీ రి­జ­ర్వే­ష­న్ బి­ల్లు­ను కేం­ద్రా­ని­కి పం­పిం­చా­ల్సి ఉండే అని కా­మెం­ట్ చే­శా­రు. రి­జ­ర్వే­ష­న్ల­పై అసలు రా­ష్ట్ర­ప­తి అపా­యిం­ట్‌­మెం­ట్ అవ­స­ర­మే లే­ద­న్నా­రు. రే­వం­త్ రె­డ్డి­కి రా­హు­ల్ గాం­ధీ కంటే కేం­ద్ర మం­త్రు­లే ఎక్కువ సా­ర్లు అపా­యిం­ట్‌­మెం­ట్ ఇచ్చా­ర­ని సె­టై­ర్లు వే­శా­రు. రా­హు­ల్ గాం­ధీ కంటే రే­వం­త్ రె­డ్డి, ప్ర­ధా­ని నరేం­ద్ర మో­డీ­తో పాటు అమి­త్ షా­ల­నే ఎక్కు­వ­గా కలి­శా­ర­ని తె­లి­పా­రు. ము­స్లిం­ల­కు బీ­జే­పీ వ్య­తి­రే­కం కా­ద­ని రాం­చం­ద­ర్ రావు అన్నా­రు. తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలతో వేడెక్కాయి.

Tags

Next Story