BJP: హైదరాబాద్ లో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం

దక్షిణాదిపై గురి పెట్టిన కమలం పార్టీ.. మిషన్‌ను షురూ చేసింది. హైదరాబాద్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక సమావేశంలో దక్షిణాదిలో బీజేపీ బలోపేతం, 11 రాష్ట్రాల అసెంబ్లీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా చర్చించనున్నారు. అనంతరం బీజేపీ సౌత్ స్టేట్స్ ఎజెండాను ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు ఫుల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. ఎలాంటి ఎన్నికల ణాళికలు రచిస్తారనేది ఆసక్తి రేపుతోంది.
ఈ 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశానికి తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్, ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్‌తో పాటు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మురళీధరరావు తదితర నాయకులు హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com