BJP: బీజేపీ జిల్లా అధ్యక్షులు వీరే

తెలంగాణలో బీజేపీ బలోపేతం దిశగా కమలం పార్టీ చర్యలు తీసుకుంటోంది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటింది. మిగతా ఆరు జిల్లాల అధ్యక్షుల ఎన్నిక త్వరలోనే జరగనుంది. ఈ జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. 27 జిల్లాలకు గాను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఏడుగురు ఉన్నారు. పార్టీ పరంగా వ్యవహారాల కోసం మొత్తం 38 జిల్లాలుగా తెలంగాణను విభజించి అధ్యక్షుడ్ని ప్రకటించడం బీజేపీలో ఉంది. అన్నీ అనుకూలిస్తే వారంలోనే రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి వచ్చే అవకాశం ఉంది. ఇన్‌ఛార్జ్ శోభ కరంద్లాజే ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నాక ఒకరిపేరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.
నల్గొండ బీజేపీలో ముసలం
నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిని మరోసారి నియమించడం ఆ పార్టీలో ముసలం పుట్టించింది. దీన్ని పార్టీలోని కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నల్గొండ జిల్లా అధ్యక్షుడ్ని మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నాగం వర్షిత్ రెడ్డి నియామకంపై బీజేపీ అసమ్మతి నేతలు బండారు ప్రసాద్, పొతేపాక సాంబయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు వీరే
1. జనగామ- చౌడ రమేష్
2. వరంగల్- గంట రవి
3. హన్మకొండ- సంతోష్ రెడ్డి
4. జయశంకర్ భూపాల పల్లి- నిశిధర్ రెడ్డి
5. నల్గొండ- నాగం వర్షిత్ రెడ్డి
6. నిజామాబాద్- దినేష్ కులాచారి
7. వనపర్తి- నారాయణ
8. హైదారాబాద్ సెంట్రల్- దీపక్ రెడ్డి
9. మేడ్చల్ రూరల్- శ్రీనివాస్
10. కొమురం భీమ్ ఆసిఫాబాద్- శ్రీశైలం ముదిరాజ్
11. కామారెడ్డి- నీలం చిన్న రాజులు
12. ములుగు- బలరాం
13. మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి
14. జగిత్యాల- యాదగిరి బాబు
15. మంచిర్యాల- వెంకటేశ్వర్లు గౌడ్
16. పెద్దపల్లి- సంజీవరెడ్డి
17 ఆదిలాబాద్- బ్రహ్మానందరెడ్డి
18. మెదక్- రాధా మల్లెష్ గౌడ్
19. సికింద్రాబాద్- గుండుగోని భరత్ గౌడ్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com