BJP: కిషన్‌రెడ్డి కొత్త జట్టు

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ.... పార్టీలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్త జట్టును సిద్ధం చేసుకున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పలు జిల్లాల అధ్యక్షులతో పాటు మోర్చాల అధ్యక్షులను మార్చి.. ఆయా స్థానాల్లో తనకు అనుకూలంగా ఉన్న వారికి చోటు కల్పించారు. 35జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన కిషన్‌రెడ్డి మరో మూడు జిల్లాల అధ్యక్షుల నియామకం పెండింగ్‌లో ఉంచారు. పార్టీ అనుబంధ సంఘాలైన మోర్చాలకు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులను నియమించింది.

పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ నాయకత్వం... అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు 10 MP సీట్లు, 35శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ..... శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో పాటు పనితీరు బాగాలేని జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 35 జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న చాలా మంది జిల్లా అధ్యక్షులకు మరోసారి అవకాశం కల్పించారు. మూడు జిల్లాలు అదిలాబాద్, మహబూబ్ బాద్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులపై ఇంకా స్పష్టత రాలేదు. రెండు మూడ్రోజుల్లో ఈ మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కిషన్‌రెడ్డి నూతన జట్టను ప్రకటించిన కాసేపటికే కిసాన్ మోర్చా తెలంగాణ అధ్యక్షుడి నియామకంపై రాష్ట్ర నాయకత్వం డైలమాలో పడింది. కిసాన్ మోర్చా, మైనార్టీ మోర్చాలకు త్వరలో అధ్యక్షులను ప్రకటిస్తామని మరో ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు, చేర్పులు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్న నలుగురిలో ఇద్దరికీ ఉద్వాసన పలికి.... కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పదాధికారుల మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.
బీజేపీ జిల్లాల అధ్యక్షులు
వికారాబాద్ - మాధవరెడ్డి
యాదాద్రి భువనగిరి - భాస్కర్
నిజామాబాద్ - దినేశ్
సిద్దిపేట - మోహన్‌రెడ్డి
జనగామ - దశమంతరెడ్డి
హనుమకొండ - రావు పద్మ
కామారెడ్డి - అరుణతార
కరీంనగర్ - కృష్ణారెడ్డి
జగిత్యాల - పైడిపల్లి సత్యనారాయణరావు
ఖమ్మం - గల్లా సత్యనారాయణ
మేడ్చల్ అర్బన్ - పన్నాల హరీశ్‌రెడ్డి
మేడ్చల్ రూరల్ - విక్రమ్‌రెడ్డి
హైదరాబాద్ సెంట్రల్ - గౌతమ్ రావు
ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కళ్యాణ్ నాయక్
ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కొండేటి శ్రీధర్
యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవెల్లా మహేందర్
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంద్‌గౌడ్
మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిల్ప
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దోళ్ల గంగారెడ్డి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com