ఎంఐఎంను ముస్లింలే చీత్కరిస్తున్నారు : బండి సంజయ్

బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చి BRS స్టీరింగ్ MIM చేతిలో ఉందంటారు... దేశం మొత్తం మోదీ, అమిత్ షా ఆధీనంలోనే ఉంది కదా.. ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని.. దానికి బాధ్యులెవరని నిలదీశారు. అసద్ కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎంఐఎంకు దమ్ముంటే తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎంఐఎంకు డిపాజిట్లు రాకుండా చేస్తామని చెప్పారు. ఎంఐఎంను ముస్లింలే చీత్కరిస్తున్నారని.. అధికార పార్టీతో అంటకాగుతూ ఆస్తులు కాపాడుకోవడమే ఓవైసీ నైజమని మండిపడ్డారు. ఇన్నేళ్లుగా పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో చెప్పాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com