తెలంగాణలో పెరుగుతున్న పొలిటికల్ హీట్

తెలంగాణలో పెరుగుతున్న పొలిటికల్ హీట్
X
ఖమ్మంపై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీలు అగ్రనాయకులతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో సభ జరగనుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. గెలుపు కోసం వ్యూహాలకు పార్టీలు పదునుపెడుతున్నాయి. అధికార పార్టీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్, బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టాయి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు.

ఖమ్మంపై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీలు అగ్రనాయకులతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో సభ జరగనుంది. సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్న ఈ మీటింగ్‌కు దాదాపు లక్ష మందిని సమీకరించాలని కమలదళం భావిస్తోంది. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ పేరుతో జరగనున్న సభలో పాల్గొననున్నారు అమిత్‌ షా. కార్యకర్తలకు భరోసా కల్పించేందుకే సభ అంటున్న బీజేపీ.. అమిత్‌షా రాకతో పార్టీ బలం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఖమ్మంలో బల ప్రదర్శనకు సిద్ధమవుతున్న నేపధ్యంలో ఇవాళ్లి నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖమ్మంలో పర్యటిస్తున్నారు. సభ ఏర్పాట్లు జన సమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

తెలంగాణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన ప్రియాంక గాంధీ.. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభలో ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. దీంతోపాటు భారీ పబ్లిక్ మీటింగ్ కు ఏర్పాటు చేస్తోంది కాంగ్రెస్‌. ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Tags

Next Story