తెలంగాణలో బీజేపీ దూకుడు

తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతోంది. నెలరోజులపాటు వివిధ కార్యక్రమాలతో జనంలోకి వెళ్లే ఏర్పాట్లు చేస్తోంది. జనసంపర్క్ అభియాన్ పేరుతో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ళ పాలనపై జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యాచరణ అమలుకు రాష్ట్ర నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించడంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ సభను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు బీజేపీ రాష్ట్ర నేతలు.
దీంతోపాటు రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభలకు ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నట్టు చెప్తున్నారు. ఇక ఈ నెల రోజుల్లోనే పార్టీ బలోపేతానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి సేకరించే పనిలో పడ్డారు బీజేపీ జాతీయ నేతలు. ఈ రిపోర్టుల ఆదారంగా భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేసి.. ఎన్నికల నాటికి పార్టీపైపు ప్రజల్ని మళ్లించేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com