బండి సంజయ్‌ని మార్చే ప్రసక్తే లేదు: తరుణ్ చుగ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ హైకమాండ్ స్పందించింది. బండి సంజయ్‌ని మార్చే ప్రసక్తే లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టత ఇచ్చారు. నేతలంతా సమష్టిగా ఎన్నికల సమరంలో ఉంటారని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ముఖ్య నేతలందరికీ కీలకమైన బాధ్యతలుంటాయన్నారు.. రాష్ట్ర నాయకత్వం సమష్టిగానే పనిచేస్తుందని చెప్పారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు.. బీఆర్‌ఎస్‌కు బీటీమ్‌గా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్న ఆయన.. కొన్ని సందర్భాల్లో బీటీమ్‌గా, ఇంకొన్ని సార్లు సీ టీమ్‌గా కాంగ్రెస్ పార్టీనే పోటీ పడుతోందని తరుణ్ చుగ్ అన్నారు.
ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనపైనా తరుణ్ చుగ్ రియాక్టయ్యారు.. అతి త్వరలో అమిత్‌షా పర్యటన కూడా కొనసాగుతుందన్నారు.. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ఇక నాగర్ కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారని తరుణ్ చుగ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com