BJP Salu Dora : సాలు దొర క్యాంపెయిన్‌ను మరింత ఉదృతం చేయనున్న బీజేపీ..

BJP Salu Dora : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన సాలు దొర-సెలవు దొర ప్రచారం మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది బీజేపీ. సాలుదొర సెలవు దొర ప్రచారాన్ని ఆపేయాలంటూ.. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందంటూ టీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ. అసలు తాము అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకోలేదని వివరణ ఇచ్చారు బీజేపీ అధికార ప్రతినిధి రుద్రమదేవి.
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ లేదని, అలాంటి సమయంలో ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. సాంకేతిక సమస్యలతో బీజేపీ ఆఫీస్ వద్ద పెట్టిన బోర్డను తీసివేశామన్నారామె. బీజేపీ కార్యాలయం ఎండకు వానకు తట్టుకునేలా వాటర్ ఫ్రూఫ్ డిజిటల్ బోర్డును శాశ్వితంగా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com