BJP: హైదరాబాద్‌లో బీజేపీ కేంద్ర కార్యవర్గ సమావేశాలు.. జూలై 2,3 తేదీల్లో..

BJP: హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూలై 2,3 తేదీల్లో ఈసమావేశాలు నోవాటెల్‌లో జరగనున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు తరలిరానున్న ఈ సమావేశాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఇందులో భాగంగా రాడిసన్ హోటల్‌లో బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్‌చుగ్.. తెలంగాణ ముఖ్యనేతలతో సన్నాహక శసమావేశం నిర్వహించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం 34 కమిటీలను నియమించారు. బండి సంజయ్ అధ్యక్షతన ఈ 34 కమిటీలు సమావేశమయ్యాయి. నేతలకు తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేశారు. కమిటీ సభ్యులకు వారి బాధ్యతలపై అవగాహన కల్పించారు. గత సమావేశాల తీరును, ప్రస్తుత సమావేశాల నిర్వహణపై నేతలకు వివరించారు.
కాగా నోవాటెల్ హోటల్‌లో ఏర్పాట్లను బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఈటల రాజేందర్ పలువురు పార్టీ నేలతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లు ఎలా ఉండాలో సూచించారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ కేసులో దోషులను రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు తరుణ్ చుగ్.
అది ప్రభుత్వ వాహనమని గుర్తించడానికి ఎందుకు ఆలస్యమైందని ఫైరయ్యారు. కేసీఆర్ చెప్పినట్లే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం కోసం మాత్రమే పనిచేయడానికి కొంతమంది పోలీసులు ఉన్నారని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ కేసులో న్యాయం జరిగే వరకు బాధితురాలి పక్షాన బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com