bjp : విజయ సంకల్ప యాత్రలతో దూసుకెళ్తున్న బీజేపీ
దేశంఅభివృద్ధి బాటలో నడవాలంటే మరోసారి బిజేపి అధికారంలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆకాంక్షించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన బిజేపి విజయసంకల్ప యాత్రలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్న నేతలు బిజేపి కి ఓటు వేసి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 2 లక్షల కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లునిజామాబాద్‌లో నిర్వహించిన భాజపా విజయసంకల్ప యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పాలించినగత ప్రభుత్వాలు దోచుకున్నాయి తప్పా చేసిందేంలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలంటే రాష్ట్రంలోనూ భాజపా అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
నిమిషం కూడా సమయాన్ని వృథా చేయకుండా దేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారన్నారు బీజేపీ నేత, నేషనల్ ఉమెన్ కమిషన్ ఖుష్బూ సుందర్. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రంలో బీజేపీని గెలిపించాలని ఖుష్బు కోరారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన బైక్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ. కంటోన్మెంట్ సమస్యను తీర్చేది కేంద్రమేనని.. ఇక్కడి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
400 సీట్లతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ విజయఢంకా మోగించడం ఖాయమని ఖుష్బు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో డిజిటల్ రంగంలో, విమానయాన, రైల్వే, త్రివిధ దళాలు, జాతీయ రహదారులు, ఇలా అన్ని రంగాల్లో వృద్ధి సాధించామని ఆమె వివరించారు.
ఎన్నికల ప్రచారం నేపధ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. అధికారుల సమాచారం మేరకు ప్రధాని మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు. 4న ఆదిలాబాద్ జిల్లాలో, 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక ఏర్పాట్లు చేపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటనపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూర్చే రీతిలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను బీజేపీ చేపడుతున్నది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com