BJP: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి నేడే ప్రకటన..!

BJP: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి నేడే ప్రకటన..!
X
ఆ ముగ్గురిలో బరిలో నిలిచేది ఎవరో..?

బీ­జే­పీ తె­లం­గాణ రా­ష్ర్ట ఎన్ని­కల కమి­టీ నేడు సమా­వే­శం కా­నుం­ది. జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­క­కు అభ్య­ర్థి­ని ఈ సమా­వే­శం­లో ఖరా­రు చే­య­నుం­ది. ము­గ్గు­రు పే­ర్ల­తో కూ­డిన జా­బి­తా­ను అధి­ష్ఠా­నా­ని­కి పం­పిం­చ­నుం­ది. అధి­ష్టా­నం ఆమో­ద­ము­ద్ర వే­సిన వెం­ట­నే బీ­జే­పీ తమ అభ్య­ర్థి­ని ప్ర­క­టిం­చే అవ­కా­శం ఉన్న­ట్లు పా­ర్టీ వర్గా­లు తె­లి­పా­యి. జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్నిక రే­సు­లో జూ­టూ­రు కీ­ర్తి­రె­డ్డి, వీ­ర­ప­నే­ని పద్మ, లంకల దీ­ప­క్‌ రె­డ్డి పే­ర్లు ప్ర­ము­ఖం­గా వి­ని­పి­స్తు­న్నా­యి. 2023 ఎన్ని­క­ల్లో జూ­బ్లీ­హి­ల్స్ నుం­చి దీ­ప­క్ రె­డ్డి పోటీ చేసి మూడో స్థా­నా­ని­కే పరి­మి­త­మ­య్యా­రు. ప్ర­స్తు­తం బీ­జే­పీ సెం­ట్ర­ల్‌ జి­ల్లా అధ్య­క్షు­డి­గా కొ­న­సా­గు­తు­న్న ఆయ­న­కు ఉప ఎన్నిక టి­కె­ట్‌ దక్కు­తుం­దా? లేదా? అనే­ది ప్ర­శ్నా­ర్థ­కం­గా మా­రిం­ది. ఆయ­న­కు టి­కె­ట్‌ ఇవ్వ­ని పక్షం­లో కీ­ర్తి రె­డ్డి­కి టి­కె­ట్ దక్కే అవ­కా­శ­ముం­ద­ని సమా­చా­రం.­పో­రు­లో ఎవరు ని­లు­స్తా­ర­న్న ఉత్కంఠ నె­ల­కొం­ది.

అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే...

ఈ ఉప ఎన్ని­క­ల్లో సత్తా చా­టా­ల­ని అన్ని పా­ర్టీ­లు పట్టు­ద­ల­గా ఉన్నా­యి. సి­ట్టిం­గ్ స్థా­నా­న్ని గె­లి­పిం­చు­కో­వా­ల­ని బీ­ఆ­ర్ఎ­స్.. ఈ సీటు గె­లి­చి సత్తా చా­టా­ల­ని కాం­గ్రె­స్ వ్యూహ రచన చే­స్తు­న్నా­యి. షె­డ్యూ­ల్ రా­వ­డం­తో జూ­బ్లీ­హి­ల్స్ లో ప్ర­చా­రం జోరు మరింత పె­ర­గ­నుం­ది. సి­ట్టిం­గ్‌ ఎమ్మె­ల్యే మా­గం­టి గో­పీ­నా­థ్‌ మృ­తి­తో ఉప ఎన్నిక అని­వా­ర్యం అయ్యిం­ది. జూ­బ్లీ­హి­ల్స్‌ బై ఎల­క్ష­న్‌­ను ప్ర­ధాన పా­ర్టీ­లు ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కు­న్నా­యి. ఇప్ప­టి­కే బీ­ఆ­ర్‌­ఎ­స్‌ అభ్య­ర్థి­ని ప్ర­క­టిం­చిం­ది. మా­గం­టి గో­పీ­నా­థ్‌ భా­ర్య సు­నీ­త­ను బరి­లో­కి దిం­చిన బీ­ఆ­ర్‌­ఎ­స్‌.. సి­ట్టిం­గ్‌ స్థా­నా­న్ని దక్కిం­చు­కో­వా­ల­న్న పట్టు­ద­ల­తో ఉంది. జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గం­లో మొ­త్తం ఓట­ర్ల సం­ఖ్య 3,99,000 కాగా, జూలై 1, 2025ను అర్హత తే­దీ­గా తీ­సు­కు­ని సవ­రిం­చిన జా­బి­తా­లో 2,07,382 మంది పు­రు­షు­లు, 1,91,593 మంది మహి­ళ­లు, 25 మంది ట్రా­న్స్‌­జెం­డ­ర్ ఓట­ర్లు ఉన్నా­రు. . లింగ ని­ష్ప­త్తి ప్ర­తి వె­య్యి పు­రు­షు­ల­కు 924 మహి­ళ­లు­గా ఉంది. ఈ జా­బి­తా­లో 6,106 మంది యువ ఓట­ర్లు (18–19 సం­వ­త్స­రా­లు), 2,613 మంది వృ­ద్ధు­లు (80 ఏళ్లు పై­బ­డిన వారు), అలా­గే 1,891 మంది వి­క­లాం­గు­లు ఉన్నా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గం­లో ఉపఎ­న్నిక ని­ర్వ­హ­ణ­కు 139 కేం­ద్రా­ల్లో 407 పో­లిం­గ్ స్టే­ష­న్లు ఏర్పా­టు చే­శా­రు.

Tags

Next Story