BJP: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి

BJP: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి
X
బీజేపీ కార్యాలయంలో కొట్టుకున్న బీసీ సంఘాల నేతలు

జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­ల్లో బీ­జే­పీ అభ్య­ర్థి­గా లంకల దీ­ప­క్ రె­డ్డి పే­రు­ను ఖరా­రు చే­శా­రు. గతం­లో ఇదే స్థా­నం నుం­చి పోటీ చేసి ఓడి­పో­యి­న­ప్ప­టి­కీ.. పా­ర్టీ ఆయ­న­కే మరో­సా­రి అవ­కా­శం కల్పిం­చిం­ది. మూడు ప్ర­ధాన పా­ర్టీ­లు బీ­ఆ­ర్ఎ­స్, కాం­గ్రె­స్, బీ­జే­పీ­లు అభ్య­ర్థు­ల­ను ప్ర­క­టిం­చ­టం­తో ఎన్ని­కల ప్ర­చా­రం ఊపం­దు­కో­నుం­ది. వీ­ర­ప­నే­ని పద్మ, వి­క్ర­మ్ గౌడ్, జూ­టూ­రు కీ­ర్తి­రె­డ్డి పే­ర్లు ప్ర­ము­ఖం­గా వి­ని­పిం­చా­యి. కానీ చి­వ­ర­కు దీ­ప­క్ రె­డ్డి­ని అభ్య­ర్థి­గా ప్ర­క­టిం­చా­రు. ప్ర­స్తు­తం ఆయన సెం­ట్ర­ల్ జి­ల్లా పా­ర్టీ అధ్య­క్షు­డి­గా కొ­న­సా­గు­తు­న్నా­రు. గత అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో ఇదే స్థా­నం నుం­చి పోటీ చేసి దీ­ప­క్ రె­డ్డి ఓడి­పో­యా­రు. 25 వేల ఓట్లు సా­ధిం­చి మూ­డో­స్థా­నం­లో ని­లి­చా­రు. దీం­తో అన్ని సమీ­క­ర­ణా­ల­ను పరి­గ­ణ­లో­ని­కి తీ­సు­కొ­ని దీ­ప­క్ రె­డ్డి­కే మరో­సా­రి అవ­కా­శం కల్పిం­చా­రు. ఈ మే­ర­కు బీ­జే­పీ అధి­కా­రిక ప్ర­క­టన వి­డు­దల చే­సిం­ది. ఇక బీ­ఆ­ర్ఎ­స్ నుం­చి ది­వం­గత ఎమ్మె­ల్యే మా­గం­టి గో­పి­నా­థ్ సతీ­మ­ణి సు­నీత, కాం­గ్రె­స్ నుం­చి నవీ­న్ యా­ద­వ్ పోటీ చే­స్తు­న్న వి­ష­యం తె­లి­సిం­దే. మూడు పా­ర్టీ­లు అభ్య­ర్థు­ల­ను ప్ర­క­టిం­చ­టం­తో ప్ర­చా­రం ఉపం­దు­కో­నుం­ది. పా­ర్టీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు రా­మ­చం­ద్ర­రా­వు న్యూ­ఢి­ల్లీ తీ­సు­కు వె­ళ్లి.. బీ­జే­పీ అధి­ష్టా­నం ముం­దు ఉం­చా­రు. అధి­ష్టా­నం లంకల దీ­ప­క్ రె­డ్డి­ని ఎం­పిక చే­సిం­ది. మరో­వై­పు అధి­కార కాం­గ్రె­స్ పా­ర్టీ అభ్య­ర్థి నవీ­న్ యా­ద­వ్.. ఎన్ని­కల ప్ర­చా­రం­లో తన­దైన శై­లి­లో దూ­సు­కు పో­తు­న్నా­రు. రూ­పొం­దిం­చి..

నవంబర్ 11న పోలింగ్..

జూ­బ్లీ­హి­ల్స్‌ సి­ట్టిం­గ్ ఎమ్మె­ల్యే మా­గం­టి గో­పీ­నా­థ్‌ అనా­రో­గ్య కా­ర­ణాల వల్ల ఈ ఏడా­ది జూ­న్‌ 8న కన్ను­మూ­శా­రు. దీం­తో ఈ స్థా­నా­ని­కి ఉపఎ­న్నిక అని­వా­ర్య­మైం­ది. ది­వం­గత ఎమ్మె­ల్యే సే­వ­ల­ను, ప్ర­జ­ల్లో ఆయ­న­కు­న్న అభి­మా­నా­న్ని దృ­ష్టి­లో ఉం­చు­కు­ని బీ­ఆ­ర్‌­ఎ­స్ అధి­ష్టా­నం ఆయన సతీ­మ­ణి సు­నీ­త­ను రం­గం­లో­కి దిం­పిం­ది. గతం­లో ఇదే స్థా­నం నుం­చి ఎం­ఐ­ఎం తర­పున పోటీ చేసి ఓడి­పో­యి ఆ తర్వాత కాం­గ్రె­స్ పా­ర్టీ­లో చే­రిన నవీ­న్ యా­ద­వ్‌­కు హస్తం పా­ర్టీ టి­కె­ట్ ఇచ్చిం­ది.

కొట్టుకున్న బీసీ సంఘాల నేతలు

బీ­జే­పీ తె­లం­గాణ కా­ర్యా­ల­యం­లో బీసీ నేతల ఫై­టిం­గ్ తీ­వ్ర కల­క­లం రే­పిం­ది. నాం­ప­ల్లి పా­ర్టీ ఆఫీ­స్‍లో బీ­జే­పీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు రా­మ­చం­ద­ర్ రావు, బీసీ సం­క్షేమ సంఘం జా­తీయ అధ్య­క్షు­డు, ఎంపీ ఆర్.కృ­ష్ణ­య్య ఎదు­టే బీసీ సం­ఘాల నే­త­లు బా­హా­బా­హీ­కి ది­గా­రు. జూ­ని­య­ర్ సీ­ని­య­ర్ వి­వా­దం తలె­త్త­డం­తో నే­త­లు ఒక­రి­పై మరొ­క­రు చే­యి­చే­సు­కు­న్నా­రు. ఈనెల 18న బీసీ జాక్ ని­ర్వ­హించ తల­పె­ట్టిన బం­ద్‍కు మద్ద­తు ఇవ్వా­ల­ని బీ­జే­పీ­ని కో­రేం­దు­కు ఆర్.కృ­ష్ణ­య్య­తో పాటు బీసీ సం­ఘాల నే­త­లు బీ­జే­పీ కా­ర్యా­ల­యా­ని­కి వచ్చా­రు. రా­మ­చం­ద­ర్ రా­వు­తో కలి­సి ప్రె­స్ మీట్ పె­ట్టే సమ­యం­లో జూ­ని­య­ర్ అయి ఉండి ఫో­టో­ల­కు ఎలా ముం­దు­కు వె­ళ్తా­వ్ అని ఒక­రి­నొ­క­రు తి­ట్టు­కుం­టూ బీసీ నే­త­లు ఘర్ష­ణ­కు ది­గి­న­ట్లు తె­లు­స్తోం­ది. దీం­తో ఒక్క­సా­రి­గా బీ­జే­పీ రా­ష్ట్ర కా­ర్యా­ల­యం­లో ఉద్రి­క్తత వా­తా­వ­ర­ణం నె­ల­కొం­ది. ఘర్ష­ణ­కు ది­గిన నే­త­ల­ను మి­గ­తా బీసీ నా­య­కు­లు అడ్డు­కు­న్నా­రు. కొ­ట్లా­ట­కు ది­గిన నే­త­ల­పై మి­గ­తా బీసీ నే­త­లు ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు.

Tags

Next Story