తెలంగాణలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి : బీజేపీ సీనియర్‌ నేత లక్ష్మణ్‌

తెలంగాణలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి :  బీజేపీ సీనియర్‌ నేత లక్ష్మణ్‌
X
తెలంగాణ సర్కారుకు ఎన్నికలపై ఉన్న సోయి... ప్రజల ప్రాణాలపై లేదని బీజేపీ సీనియర్‌ నేత లక్ష్మణ్‌ విమర్శించారు

తెలంగాణ సర్కారుకు ఎన్నికలపై ఉన్న సోయి... ప్రజల ప్రాణాలపై లేదని... బీజేపీ సీనియర్‌ నేత లక్ష్మణ్‌ విమర్శించారు. మినీ మున్సిపల్‌ ఎన్నికలను వెంటనే వాయిదా వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు ఈ మెయిల్‌ ద్వారా లేఖ పంపినట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు వాయిదా అవసరం లేదని ప్రభుత్వం చెప్పడం బాధ్యతా రాహిత్యమని అన్నారు. తెలంగాణలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కరోనా పేరిట దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని... కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

Tags

Next Story