BJP : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ రాజకీయ తీర్మానాలు..

BJP : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ రాజకీయ తీర్మానాలు..
BJP : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ రాజకీయ తీర్మానాలను ప్రవేశ పెట్టనుంది.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది.

BJP: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ రాజకీయ తీర్మానాలను ప్రవేశ పెట్టనుంది.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది. కీలకమైన రాజకీయ తీర్మానాలకు రాష్ట్ర కార్యవర్గం ఆమోదం తెలపనుంది.


తెలంగాణకు కేంద్రం చేసిన సాయాన్ని ప్రజల మధ్య చర్చ పెట్టాలని తీర్మానం చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం, ఎన్నికల హామీల గురించి సర్కార్ పై ఒత్తిడి తేవడం, ఉద్యమ కార్యచరణపై తీర్మానం చేసే చాన్స్ ఉంది.


పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజాగోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు, పార్లమెంట్ ప్రవాస యోజనపై కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. చివరగా మునుగోడు బైపోల్ ఫలితం, భవిష్యత్ కార్యచరణపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నాయకులు చర్చించనున్నారు.

మరోవైపు బీజేపీ శిక్షణా తరగతులు మూడు రోజుల పాటు శామీర్ పేట్ లియోనియా రిసార్ట్ లో జరుగుతున్నాయి. సంస్థాగత నిర్మాణంతో పాటు 14 అంశాలపై చర్చించారు. దేశ నిర్మాణంలో బీజేపీ పాత్ర, మోదీ ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత, భవిష్యత్ ఫలితాలపై నేతలు చర్చించారు.


బలహీనవర్గాలకు మోడీ ప్రభుత్వ ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చించారు. ఈ శిక్షణ శిబిరాలకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అర్వింద్​, సోయం బాబూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story