తెలంగాణ

Rajasingh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యాలు

Rajasingh : హైదరాబాద్‌ పేరు కాదు.. తెలంగాణలో అనేక జిల్లా పేర్లను సైతం మారుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.

Rajasingh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యాలు
X

Rajasingh : హైదరాబాద్‌ పేరు కాదు.. తెలంగాణలో అనేక జిల్లా పేర్లను సైతం మారుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ మీటింగ్‌ అంటూ అనవసరంగా ప్రాపగండా చేస్తున్నారంటూ ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదన్నారు.

కచ్చితంగా హైదరాబాద్‌ పేరు భాగ్యనగర్‌గా మారుస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే... తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. యూపీ సీఎం యోగి సైతం అప్పట్లో ప్రకటన చేశారని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లతో పాటు మిగిలిన నగరాల పేర్లను సైతం మారుస్తామన్నారు.

నిజాం సర్కారు బలవంతంగా మార్చిన పేర్లన్నింటిని తిరిగి మారుస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేర్లు మారుస్తామన్నారు. నిజాం దౌర్జన్యాలను ప్రజల ముందు పెడతామని, నిజాం కట్టడాలను ధ్వంసం చేస్తామన్నారు. అమరుల పేర్లను తెలంగాణలోని జిల్లాలకు పెడతామన్నారు.

Next Story

RELATED STORIES