BJP MLA: రాజాసింగ్ రాజీనామా ఆమోదం

BJP MLA: రాజాసింగ్ రాజీనామా ఆమోదం
X
తుది శ్వాస వరకు హిందూత్వం కోసమే పోరాడుతా: రాజాసింగ్

గో­షా­మ­హ­ల్‌ ఎమ్మె­ల్యే రా­జా­సిం­గ్‌ రా­జీ­నా­మా­ను బీ­జే­పీ అధి­ష్ఠా­నం ఆమో­దిం­చిం­ది. జా­తీయ అధ్య­క్షు­డు జేపీ నడ్డా ఆదే­శాల మే­ర­కు రా­జా­సిం­గ్‌ రా­జీ­నా­మా­ను ఆమో­దిం­చా­మ­ని, ఈ ని­ర్ణ­యం తక్ష­ణ­మే అమ­ల్లో­కి వస్తుం­ద­ని బీ­జే­పీ జా­తీయ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి అరు­ణ్‌­సిం­గ్‌ ప్ర­క­టన వి­డు­దల చే­శా­రు. బీ­జే­పీ తె­లం­గాణ అధ్య­క్ష ఎన్నిక వి­ష­యం­లో అలి­గిన రా­జా­సిం­గ్‌ పా­ర్టీ ప్రా­థ­మిక సభ్య­త్వా­ని­కి రా­జీ­నా­మా చే­శా­రు. కేం­ద్ర మం­త్రి కి­ష­న్‌­రె­డ్డి­కి లేఖ అం­ద­జే­శా­రు. పా­ర్టీ రా­ష్ట్ర అధ్య­క్ష పద­వి­కి నా­మి­నే­ష­న్‌ వే­సేం­దు­కు తనను అను­మ­తిం­చ­లే­ద­ని, అం­దు­కే రా­జీ­నా­మా చే­సి­న­ట్టు పే­ర్కొ­న్నా­రు. జూన్ 30న తన రా­జీ­నా­మా లే­ఖ­ను అధి­ష్టా­నా­ని­కి పం­పా­రు రా­జా­సిం­గ్. మరో­వై­పు, బీ­జే­పీ­కి రా­జీ­నా­మా చే­సి­నా.. హిం­దు­త్వం కోసం పో­రా­డు­తూ­నే ఉం­టా­ను అని గతం­లో­నే రా­జా­సిం­గ్‌ ప్ర­క­టిం­చా­రు. పా­ర్టీ రా­ష్ట్ర అధ్య­క్షు­లు­గా పని చే­సిన కేం­ద్ర మం­త్రు­లు కి­ష­న్‌ రె­డ్డి, బండి సం­జ­య్‌­‌­ల­పై గతం­లో రా­జా­సిం­గ్ అనేక ఆరో­ప­ణ­లు చే­శా­రు. తా­జా­గా రా­జా­సిం­గ్‌ రా­జీ­నా­మా­ను పా­ర్టీ ఎట్ట­కే­ల­కు ఆమో­దం తె­లి­పిం­ది.

తుది శ్వాస వరకు హిందూత్వం కోసమే

హిం­దు­త్వం కో­స­మే తన చి­వ­రి శ్వాస వరకు పని­చే­స్తా­న­ని ఎమ్మె­ల్యే రా­జా­సిం­గ్‌ అన్నా­రు. ఇటీ­వల భా­జ­పా­కు ఆయన చే­సిన రా­జీ­నా­మా­ను ఆ పా­ర్టీ జా­తీయ అధ్య­క్షు­డు జేపీ నడ్డా శు­క్ర­వా­రం ఆమో­దిం­చా­రు. ఈ నే­ప­థ్యం­లో రా­జా­సిం­గ్‌ ‘ఎక్స్‌’లో పో­స్ట్‌ చే­శా­రు. ‘‘హిం­దు­త్వ భా­వ­జా­లం­తో దే­శా­ని­కి, ప్ర­జ­ల­కు సేవ చే­యా­ల­నే లక్ష్యం­తో సరి­గ్గా 11 ఏళ్ల క్రి­తం భా­జ­పా­లో చే­రా­ను. పా­ర్టీ నన్ను నమ్మి తె­లం­గాణ అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో వరు­స­గా మూ­డు­సా­ర్లు గో­షా­మ­హ­ల్ ఎమ్మె­ల్యే టి­కె­ట్ ఇచ్చిం­ది. పా­ర్టీ రా­ష్ట్ర, జా­తీయ నా­య­క­త్వా­ని­కి నా హృ­ద­య­పూ­ర్వక కృ­త­జ్ఞ­త­లు. నా రా­జీ­నా­మా­ను నడ్డా ఆమో­దిం­చా­రు. తె­లం­గా­ణ­లో బీజేపీ ప్ర­భు­త్వా­న్ని ఏర్పా­టు చే­యా­లం­టూ రా­త్రీ­ప­గ­లు పని­చే­స్తు­న్న లక్ష­లా­ది కా­ర్య­క­ర్తల బా­ధ­ను నేను అధి­ష్ఠా­నా­ని­కి తె­లి­య­జే­య­లే­క­పో­వ­చ్చు. ఏ పదవి, అధి­కా­రం, వ్య­క్తి­గత లబ్ధి కో­స­మో రా­జీ­నా­మా చే­య­లే­దు. నేను హిం­దు­త్వం కో­స­మే పు­ట్టా­ను.. చి­వ­రి శ్వాస వరకు దా­ని­కో­స­మే పని­చే­స్తా­’’ అని రా­జా­సిం­గ్‌ పే­ర్కొ­న్నా­రు.

Tags

Next Story