కాంగ్రెస్ ఒత్తిడిలో ఫేస్‌బుక్ పనిచేస్తోందా? : ఎమ్మెల్యే రాజా సింగ్

తన వివాదాస్పద ప్రసంగాలను ఫేస్‌బుక్ నిషేధించిందనే వార్తలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. 2019 ఏప్రిల్ నుంచి తను అసలు ఫేస్‌బుక్‌లోనే లేనంటూ ఆయన వివరణ ఇచ్చారు. 2018లోనే తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు రాజసింగ్ చెప్పారు. దీనికి సంబంధించి 2018 అక్టోబర్ 8న హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అయితే ఆ తర్వాత మరో కొత్త ఫేస్‌బుక్ పేజిని క్రియేట్ చేశామని చెప్పారు. కానీ అది 2019 ఏప్రిల్‌లో డిలీట్ అయిందన్నారు.
ఈ విషయంపై తను ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి అంటే 2019 ఏప్రిల్ నుంచి తను ఫేస్‌బుక్ వాడనప్పుడు... తన వివాదాస్పద ప్రసంగాలను బ్యాన్ చేశారనడంలో అర్థమే లేదని రాజా సింగ్ అన్నారు. కాంగ్రెస్ ఒత్తిడిలో ఫేస్‌బుక్ పనిచేస్తోందా అంటూ ఆయన ప్రశ్నించారు. తన పేరిట ఫేస్‌బుక్‌లో ఉన్న ఫేక్ అకౌంట్లను తొలగించినట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com