MLA Raja Singh Arrested : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్!

X
By - TV5 Digital Team |8 Jan 2021 12:41 PM IST
MLA Raja Singh Arrested : హైదరాబాద్ ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. తులసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో సడక్ బంద్ నేపథ్యంలో గోరక్షక్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
MLA Raja Singh Arrested : హైదరాబాద్ ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. తులసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో సడక్ బంద్(Go Sadak Bandh) నేపథ్యంలో గోరక్షక్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి గోరక్షకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ((T. Raja Singh))ను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక(Karnataka) తరహాలో తెలంగాణలో కూడా గోచట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న గోవధను అరికట్టాలని పేర్కొన్నారు. కనీసం ఐదు నిమిషాలు కూడా నిరసన చేయకుండా అరెస్టు చేయడం పట్ల పోలీసులపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com