RAJASINGH: ఔరంగజేబ్ సమాధిని కూల్చేస్తాం

RAJASINGH: ఔరంగజేబ్ సమాధిని కూల్చేస్తాం
X
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి అంశం దేశవ్యాప్తంగా వివాదానికి కేంద్ర బిందువుగా మారిన వేళ... తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చి వేస్తామని, సముద్రంలో పడేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా తెలంగాణ హిందువులు తరలి వెళతారని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఔరంగజేబ్, బాబర్ వారసులు ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ అజెండాలో భారత్ ను హిందూ దేశంగా మారుస్తామనే ప్రకటన ఉండాలని రాజాసింగ్ కోరారు. వచ్చే ఎన్నికలు హిందూ దేశ భవిష్యత్తు, కాశీ, మథుర అంశాలపై ఆధారపడతాయని చెప్పారు.

శోభాయాత్రకు అనుమతి ఎందుకు

దూల్‌పేటలో నిర్వహించే శోభాయాత్రపైనా రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రను ఎంఐఎం ఆదేశంతోనే రద్దు చేశారని.. కానీ ఈ ఏడాది శోభాయాత్రకు ఎవరి పర్మిషన్ అవసరం లేకుండానే నిర్వహిస్తామని ఎమ్మెల్యే అన్నారు.శ్రీరామ నవమి శోభాయాత్రకు బలమైన సంకల్పం తీసుకోవాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.


Tags

Next Story