Bandi sanjay : ఇవాళ ఢిల్లీలో బండి సంజయ్ మౌన దీక్ష.. !

Bandi Sanjay : రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ ఢిల్లీలో మౌన దీక్ష చేపట్టనున్నారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంశాల గురించి సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. దీక్షకు ఉపక్రమించారు. రాజ్‌ఘాట్ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. బండి సంజయ్‌తో పాటు ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాబూరావు తదితరులు ఈ దీక్షలో పాల్గొననున్నారు. అటు.. కాంగ్రెస్ సైతం నిరసనలకు పిలుపునిచ్చింది. ఇవాళ, రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. రాజ్యాంగం రద్దు మాటలు కేసీఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు గాంధీభవన్‌లో నిరసన దీక్షలు చేపడతామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com