కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణం: బీజేపీ ఎంపీ అరవింద్‌

కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణం: బీజేపీ ఎంపీ అరవింద్‌
X
తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణం అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ దర్మపురి అరవింద్‌. రాష్ట్రంలో అవసరమైన సమయంలో లాక్‌డౌన్‌ పెట్టలేదని మండిపడ్డారు

తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణం అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ దర్మపురి అరవింద్‌. రాష్ట్రంలో అవసరమైన సమయంలో లాక్‌డౌన్‌ పెట్టలేదని మండిపడ్డారు. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రంపై బురదజల్లడం మానుకోవాలన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే సీఎం జిల్లాల పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకునే నీచ సంస్కృతికి కేసీఆర్ తెరలేపారని మండిపడ్డారు. దత్తత తీసుకున్న 8 నెలల తరువాత వాసాలమర్రి గ్రామం గుర్తొచ్చిందా అని కామెంట్ చేశారు. మల్లన్నసాగర్ బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందన్నారు. భూములను అమ్మాలనుకోవడం ప్రభుత్వ చేతగానితనం, దివాలాకోరుతనానికి నిదర్శనం అన్నారు ఎంపీ అరవింద్.

Tags

Next Story