MP Arvind : 'రైతుల కోసం నీ కాళ్ళు మొక్కమంటే మొక్కుత'.. కేసీఆర్ పై ఎంపీ అర్వింద్

MP Arvind : దాన్యం కొనుగోళ్ల విషయంలో TRS ప్రభుత్వం కొత్త నాటకానికి తెర తీసిందంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల నుంచి వెల్లువెత్తున్న డిమాండ్లు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం కేసీఆర్ కాళ్లు మొక్కమంటే మొక్కుతామని.. దాన్యం మొత్తం కొనాల్సిందేనని అన్నారు. ధాన్యం కొనేందుకు మిల్లర్లు ముందుకు రాక, ఇటు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక రైతులు తీవ్ర అవస్థ పడుతున్నారన్నారు. 1400 కూడా రైతుకు గిట్టుబాటు కాదన్న అర్వింద్.. ఇంకో 300 ప్రభుత్వమే బోనస్ ఇవ్వాలన్నారు. మక్కలు, పత్తి, పసుపు రైతుల్ని మోసం చేసినట్టే ఇప్పుడు వరి పండించిన రైతుల్ని కూడా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
KCR సారూ మీ పన్ను 🦷 క్షేమమేనా !
— Arvind Dharmapuri (@Arvindharmapuri) April 7, 2022
పొద్దున్నే ఫోన్లుస్తున్నయ్..
ధాన్యం కొనమని రైతులయి, కార్యకర్తలయి వస్తున్నయి..
అడిగితే పైసలు లేవని మిల్లర్లు చెప్తున్నరు..
ఒక్క మూడొందల రూపాయలు ఇయ్యి…బాయిల్డ్ కి
రైతుల కోసం నీ కాళ్ళు మొక్కమంటే మొక్కుత…నీ బాంచెన్ !@BJP4Telangana @BJP4India pic.twitter.com/rFnBxe0Jcr
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com