BJP: అల్లు అర్జున్ కేసు చాలా చిన్నది: బీజేపీ ఎంపీ

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు, ఈ ఘటనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావుస్పందించారు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని పక్కనపెట్టి హీరోను మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతుందన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని ఆరోపించారు. బన్నీ ప్రెస్‌మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు సీపీ వీడియోలు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష గట్టినట్లు ప్రవర్తించడం సరికాదన్నారు.
ప్రతిపక్షాల అనుమానం
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్‌తో పాటు చిత్రపరిశ్రమపై ఘాటు కామెంట్స్ చేయడం, ఆ తర్వాత మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇదంతా వ్యూహం ప్రకారమే జరుగుతున్న వివాదంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు భావిస్తున్నారు. పాలనలో రేవంత్‌రెడ్డి విఫలమైందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాల నుంచి జనాన్ని పక్కకు మళ్లించేందుకే సినీ సెలబ్రిటీ అల్లు అర్జున్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, ఇప్పుడు విచారణ పేరుతో మరింత కాలం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.
డీకే అరుణ కామెంట్స్ వైరల్
తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తోందని విమర్శించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వాళ్ల పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. హైడ్రా పేరుతో భవనాలను కూల్చి, రియల్ ఎస్టేట్ కుదేలయ్యేలా చేశారని ఆమె అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com