నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు..!

నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం కానున్నారు. సమావేశం కోసం నాగార్జున సాగర్ బీజేపీ నాయకులకు బండి సంజయ్ నుంచి పిలుపు వచ్చింది. అటు.. అభ్యర్థిపై జాతీయ నాయకత్వంతో చర్చించిన బండి సంజయ్.. హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యంగా కమలనాథులు కుల సమీకరణాలను పరిశీలిస్తున్నారు.
రేసులో కడారి అంజయ్య, రవి నాయక్, నివేదితారెడ్డి పేర్లు ఉన్నాయి. అనూహ్యంగా తెరపైకి టీఆర్‌ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి పేరు కూడా వచ్చింది. 35 వేలకు పైగా ఉన్న గిరిజన ఓట్లపై బీజేపీ గురి పెట్టింది. గిరినజ ఓట్ల నేపథ్యంలో ప్రచారంలో రవి నాయక్ పేరు విన్పిస్తోంది. మరోవైపు.. అభ్యర్థిని వెంటనే తేల్చాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నా.. టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించాకేనంటూ పార్టీ స్పష్టం చేస్తోంది. దీంతో... నేడో రేపో బీజేపీ అభ్యర్థిపై క్లారిటీ రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com