బండికి అండగా సీనియర్ నేతలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి బండి సంజయ్‌కు అండగా నిలుస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. అధ్యక్ష మార్పు ప్రచారం తిప్పికొట్టేందుకు సీనియర్లు రంగంలో దిగారు. అధ్యక్షుడిగా బండి కొనసాగుతారని ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆఫ్ ది రికార్డు, మీడియా సమావేశాల్లోనూ ఈ మేరకు ప్రకటనలు చేస్తున్నారు. జాతీయ నాయకత్వం సూచనలతోనే ఈ మేరకు ప్రకటన చేస్తున్నారంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే... ఈటలకు పదవిపై మాత్రం నోరుమెదపడం లేదు సీనియర్లు. మొత్తానికి మరోసారి బండి సంజయ్ ఫామ్‌లోకి వచ్చారు. అమిత్‌షా సభ విజయవతం కోసం... వరుస రివ్యూలు చేస్తున్నారు.
ఇటు... ఈటల రాజెందర్‌కు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారంటూ గతంలో లీకులు ఇచ్చిన బీజేపీ వర్గాలు.. ఇప్పుడు అలాంటి పోస్టే లేదంటున్నారు. అయితే... 2014 ఎన్నికలకు ముందు మోదీ ఇలాంటి బాధ్యతలు... నిర్వహించారంటున్నారుంటున్నారు మరికొందరు. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండాలని ఈటల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన మౌనం వీడటం లేదు. ఏ బాధ్యత ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయానికి వదిలేసినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com