రేపు రాష్ట్రానికి రానున్న అమిత్ షా.. ఖమ్మంలో బహిరంగ సభ

తెలంగాణపై బీజేపీ అగ్రనాయత్వం ఫోకస్ పెట్టింది. వరుస పర్యటనలతో కమలం నేతలు తెలంగాణలో సెగలు పుట్టిస్తున్నారు. బీజేపీ పెద్దలు ఒకరి తరువాత మరొకరు రాష్ట్రాకి వస్తూ.. రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రేపు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 15న ఖమ్మంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు అమిత్ షా. ఇక అమిత్ షా పర్యటన నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే, అమిత్‌షా తెలంగాణ టూర్‌లో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.. డైరెక్టర్ రాజమౌళితో అమిత్‌షా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. రాజమౌళి, అమిత్‌షా భేటీపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.. వివిధ రాష్ట్రాల పర్యటనల్లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను కలుస్తున్నారు అమిత్‌షా.. గతంలో హైదరాబాద్ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్, మిథాలీ రాజ్‌ను కలిశారు.. తాజా టూర్‌లో సినీ రంగంతోపాటు పొలిటికల్, మీడియా, స్పోర్ట్స్ రంగాల్లోని ప్రముఖులను కలవనున్నారు.
అమిత్ షా రాకతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో వర్గపోరుపై అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు షా టూర్‌కు ముందు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మౌనంగా ఉన్నారు. ఇటీవల ఈటల అసోం సీఎం హిమంత బిశ్వశర్మను కలిశారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈటల మౌనంపై జోరుగా చర్చ జరుగుతుంది. ఇక అధ్యక్షుడి మార్పు, ఈటలకు ప్రమోషన్‌పై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చపై అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది
కర్నాటక ఫలితాల తరువాత అమిత్ షా తొలిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఖమ్మం సభ కంటే ముందే శంషాబాద్‌లో బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు అమిత్ షా. ఈ నేపథ్యంలోనే తీరు సరిగా లేని నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఖమ్మం వేదికగా రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. షా పర్యటన నేపథ్యంలో బీజేపీ ఎన్టీఆర్ నామస్మరణ చేపట్టింది. తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఇక షా టూర్‌కు ముందు పొత్తులపై బీజేపీ కొత్త సమీకరణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం అమిత్ షా టూర్‌తో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com