BJP: కవిత పార్టీతో నష్టం ఏమీ లేదు

BJP: కవిత పార్టీతో నష్టం ఏమీ లేదు
X
కవితకు కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

తె­లం­గాణ జా­గృ­తి రా­జ­కీయ పా­ర్టీ­గా మా­ర­బో­తోం­ద­ని ఎమ్మె­ల్సీ కవిత ప్ర­క­టిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. దీ­ని­పై బీ­జే­పీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు రా­మ­చం­ద­ర్‌ రావు స్పం­దిం­చా­రు. KA పాల్ కూడా పా­ర్టీ పె­ట్టా­ర­ని, ఎవ­రై­నా పా­ర్టీ­లు పె­ట్టు­కో­వ­చ్చ­ని సె­టై­ర్లు వే­శా­రు. కవిత పా­ర్టీ పె­ట్ట­డం వల్ల తమకు వచ్చే నష్టం ఏమీ లే­ద­న్నా­రు. ఆమె ఆత్మ­గౌ­ర­వం ఎలా దె­బ్బ­తిం­దో వా­ళ్ల కు­టుంబ అం­శ­మ­ని, ఆమె చే­సిన ఆరో­ప­ణ­ల­పై ప్ర­భు­త్వం వి­చా­రణ చే­యిం­చా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. కవిత పా­ర్టీ­తో తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో ఎలాం­టి మా­ర్పు­లు రావన్నారు.

కవితకు కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

శా­స­న­మం­డ­లి­లో ఎమ్మె­ల్సీ కవిత చే­సిన ప్ర­సం­గం­పై కాం­గ్రె­స్ నే­త­లు సూటి ప్ర­శ్న­లు సం­ధి­స్తు­న్నా­రు. అధి­కా­రం­లో ఉన్న­ప్పు­డు కవిత ఎం­దు­కు ఈ ప్ర­శ్న­లు అడ­గ­లే­ద­ని ని­ల­దీ­స్తు­న్నా­రు. అవి­నీ­తి జరు­గు­తు­న్న­ప్పు­డు చూ­స్తూ ఉం­డి­పో­యా­రా? అని మం­డి­ప­డు­తు­న్నా­రు. తె­లం­గాణ బి­డ్డ­లు ఆత్మ బలి­దా­నా­లు చే­సు­కు­న్న­ప్పు­డు ఈ కన్నీ­ళ్లు ఏమ­య్యా­య­ని క్వ­శ్చ­న్ చే­శా­రు. అన్నిం­టి­ని ప్ర­శ్నిం­చిన కవిత లి­క్క­ర్ స్కాం­పై సమా­ధా­నం ఎం­దు­కు చె­ప్ప­లే­ద­ని ని­ల­దీ­స్తు­న్నా­రు. ప్రస్తుతం కవిత వివాదం తెలంగాణలో కలకలం రేపుతోంది.

కవితపై బీఆర్ఎస్ ఎటాక్

బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు తనకు తెలియదంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మరి తెలంగాణ జాగృతి పేరును భారత్ జాగృతిగా ఎందుకు మార్చారో చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. BRS పార్టీ జెండాను ఆవిష్కరించినపుడు.. 'జననేతకు జయహారతి. న్యూ స్టార్ట్, న్యూ మిషన్ బై ద లీడర్ విత్ ఏ విజన్, కేసీఆర్ గారు. విజయీభవ జై భారత్ జై తెలంగాణ' అని ఎందుకు రాశారని కవితను నిలదీస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్రంగా స్పందించారు. కవిత మాటలు బీఆర్ఎస్ పార్టీకి పెను ఇబ్బందిగా మారాయని, ఆమె వెనుక ఎవరో ఉన్నారన్నారు. కేసీఆర్‌ను కంటతడి పెట్టిస్తూ.. మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బహిష్కరిస్తే, కవిత మాత్రం భిన్నంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. కవిత రాజీనామా పెద్ద డ్రామా అన్నారు.

Tags

Next Story