BJP: తెలంగాణపై బీజేపీ ఫోకస్.. ఇకపై హైదరాబాద్‌లోనే..

X
BJP: బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెంచింది.. ఇప్పటికే అగ్రనేతలంతా ఒక్కొక్కరుగా తెలంగాణ పర్యటనకు వస్తుండగా.. ఈసారి జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. రెండు రోజులపాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి..
అయితే, హైదరాబాద్‌లో ఈ సమావేశాలకు అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నారు.. ప్రధాన మంత్రితోపాటు కేంద్ర కేబినెట్ మొత్తం హైదరాబాద్‌లోనే మకాం వేయనుంది.. 18 రాష్ట్రాలకు చెందిన సీఎంలతోపాటు 29 రాష్ట్రాల అద్యక్షులు, జాతీయ నేతలంతా హైదరాబాద్‌కు తరలిరానున్నారు.. అయితే, సమావేశాల తేదీలు ఇంకా ఖరారు కాలేదు.. జులై రెండో వారంలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
