BJP: పేలుళ్లకు బీజేపీతో ఏం సంబంధం..?

BJP: పేలుళ్లకు బీజేపీతో ఏం సంబంధం..?
X
బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు

ఢి­ల్లీ పే­లు­ళ్ల­పై కొం­ద­రు దు­ష్ర్ప­చా­రం చే­స్తు­న్నా­ర­ని మె­ద­క్ బీ­జే­పీ ఎంపీ రఘు­నం­ద­న్ రావు అస­హ­నం వ్య­క్తం చే­శా­రు. చే­తి­లో ఫోన్ ఉంది కదా అని ఇష్ట­మొ­చ్చి­న­ట్లు పో­స్టు­లు పె­డు­తు­న్నా­ర­ని, బాం­బు పే­లు­ళ్ల­తో బీ­జే­పీ­కి ఏం సం­బం­ధం అంటూ ఫై­ర­య్యా­రు. ఇలాం­టి అస­త్య వ్యా­ఖ్య­లు చే­య­డం కూడా దే­శ­ద్రో­హం కిం­ది­కే వస్తుం­ద­న్నా­రు. సర్దా­ర్ వల్ల­భా­య్ పటే­ల్ 150వ జయం­తి సం­ద­ర్భం­గా సం­గా­రె­డ్డి­లో­ని ఐబీ నుం­చి కలె­క్ట­ర్ వరకూ ని­ర్వ­హిం­చిన సర్దా­ర్ -ఏక్తా పా­ద­యా­త్ర­లో ఆయన పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా రఘు­నం­ద­న్ రావు మా­ట్లా­డు­తూ.. బాం­బు పే­లు­ళ్ల వె­నుక బీ­జే­పీ ఉం­దం­టూ వస్తో­న్న పో­స్టు­ల్ని తీ­వ్రం­గా ఖం­డిం­చా­రు. ఎన్ని­క­లొస్తే బ్లా­స్టు­లు జరు­గు­తాయని సో­ష­ల్ మీ­డి­యా­లో నీ­చం­గా మా­ట్లా­డు­తు­న్నా­ర­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు.

200 ఐఈడీ బాంబులు.. 26/11 తరహా దాడులకు కుట్ర

ఎర్ర­కోట వద్ద పే­లు­డు ఘట­న­లో తవ్వే కొ­ద్దీ సం­చ­లన వి­ష­యా­లు వె­లు­గు­లో­కి వస్తు­న్నా­యి. 26/11 ముం­బ­యి దా­డుల తర­హా­లో దేశ రా­జ­ధా­ని­లో వరుస పే­లు­ళ్ల­కు ఉగ్ర­వా­దు­లు కు­ట్ర పన్ని­న­ట్లు జా­తీయ దర్యా­ప్తు సం­స్థ ఎన్ఐఏ అను­మా­ని­స్తోం­ది. టా­ర్గె­ట్‌ లి­స్ట్‌­లో ఎర్ర­కో­ట­తో పాటు ఇం­డి­యా గే­ట్‌ వంటి ఇతర ప్ర­ముఖ కట్ట­డా­లు ఉన్న­ట్లు దర్యా­ప్తు వర్గా­ల­ను ఉటం­కి­స్తూ జా­తీయ మీ­డి­యా­లో కథ­నా­లు వె­లు­వ­డ్డా­యి. ఇం­దు­కో­సం భా­రీ­గా బాం­బు­ల­ను కూడా తయా­రు­చే­స్తు­న్న­ట్లు పే­ర్కొ­న్నా­యి. పే­లు­డు­కు కా­ర­ణ­మైన వై­ద్యుల టె­ర్ర­ర్‌ మా­డ్యూ­ల్‌ వెనక పా­క్‌ కేం­ద్రం­గా పని­చే­స్తో­న్న జైషే మహ్మ­ద్‌ ఉగ్ర ముఠా ఉన్న­ట్లు ప్రా­థ­మి­కం­గా గు­ర్తిం­చా­రు. ది­ల్లీ­లో వరుస పే­లు­ళ్ల కోసం ఉగ్ర­వా­దు­లు జన­వ­రి నుం­చి పథక రచన చే­స్తు­న్న­ట్లు వి­చా­ర­ణ­లో తే­లి­న­ట్లు సమా­చా­రం. టె­ర్ర­ర్‌ మా­డ్యూ­ల్‌ అత్యంత శక్తి­మం­త­మైన 200 ఐఈ­డీ­ల­ను సి­ద్ధం చేసే పని­లో ఉన్న­ట్లు దర్యా­ప్తు వర్గా­లు తె­లి­పా­యి.

టెర్రర్ మాడ్యూల్‌కు తుర్కియే లింకులు

ఫరీ­దా­బా­ద్ టె­ర్ర­ర్ మా­డ్యూ­ల్‌­కు సం­బం­ధిం­చిన కీలక వి­ష­యా­లు రో­జు­రో­జు­కు వె­లు­గు­లో­కి వస్తు­న్నా­యి. ఈ మా­డ్యూ­ల్‌­లో కీలక వ్య­క్తు­లు­గా ఉన్న డా­క్ట­ర్‌ ఆది­ల్‌, ము­జ­మ్మి­ల్‌­ల­కు తు­ర్కి­యే హ్యాం­డ్ల­ర్ల­తో సం­బం­ధా­లు ఉన్న­ట్లు నిఘా వర్గా­లు గు­ర్తిం­చా­యి. ఈ ఏడా­ది ప్రా­రం­భం­లో వీరు తు­ర్కి­యే­లో పర్య­టిం­చి­న­ట్లు, వీరి బస ఏర్పా­ట్ల­ను అక్క­డి హ్యాం­డ్ల­ర్లే చూ­సు­కు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ పర్య­ట­న­లో వా­రి­తో కలి­సి ఈ మా­డ్యూ­ల్ సభ్యు­లు కు­ట్ర­లు పన్ని­న­ట్లు అధి­కా­రు­లు అను­మా­నా­లు వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ఈ ఉగ్ర నె­ట్‌­వ­ర్క్‌­కు వి­దే­శాల నుం­చి ఆర్థిక మద్ద­తు లభిం­చి­న­ట్లు దర్యా­ప్తు­లో తే­లిం­ది. 2023-24 మధ్య కా­లం­లో ఇస్తాం­బు­ల్‌, దోహా నుం­చి డి­జి­ట­ల్‌ వా­లె­ట్ల ద్వా­రా వై­ద్యు­ల్లో ఒక­రి­కి వి­దే­శీ ని­ధు­లు అం­ది­న­ట్లు నిఘా వర్గా­లు కను­గొ­న్నా­యి. మరో­వై­పు, అరె­స్ట­యిన మహి­ళా డా­క్ట­ర్ల­లో ఒక­రి­కి చెం­దిన బ్రె­జా కా­రు­పై అధి­కా­రు­లు దృ­ష్టి­సా­రిం­చా­రు. ఆ కా­రు­లో పే­లు­డు పదా­ర్థా­లు ఉం­డ­వ­చ్చ­ని అను­మా­ని­స్తూ దాని కోసం గా­లిం­పు చర్య­లు చే­ప­ట్టా­రు. అరె­స్ట­యిన ఇద్ద­రు మహి­ళా డా­క్ట­ర్ల సో­ష­ల్‌­మీ­డి­యా చా­ట్‌­ల­ను కూడా అధి­కా­రు­లు పరి­శీ­లిం­చా­రు. ని­ధుల బది­లీ­లు, లా­జి­స్టి­క్స్‌, సు­ర­క్షిత ప్ర­దే­శా­లు గు­రిం­చి వారు అం­దు­లో చర్చిం­చి­న­ట్లు గు­ర్తిం­చా­రు. బం­గ్లా­దే­శ్‌­లో­ని ఢాకా మె­డి­క­ల్‌ కళా­శా­ల­లో ఎం­బీ­బీ­ఎ­స్‌ పూ­ర్తి­చే­సిన ఈ మహి­ళా డా­క్ట­ర్లు, శ్రీ­న­గ­ర్‌­లో ఇం­ట­ర్న్‌­షి­ప్‌ సం­ద­ర్భం­గా మత బో­ధ­కు­డు ఇర్ఫా­న్‌ అహ్మ­ద్‌­తో ఏర్ప­డిన పరి­చ­యం­తో­నే ఉగ్ర­వాద భా­వ­జా­లం వైపు మొ­గ్గు చూ­పి­న­ట్లు అధి­కా­రు­లు తె­లి­పా­రు. తు­ర్కి­యే హ్యాం­డ­ర్ల­తో ఈ మా­డ్యూ­ల్‌­కు ఉన్న సం­బం­ధా­ల­పై నిఘా సం­స్థ­లు మరింత లో­తు­గా దర్యా­ప్తు చే­స్తు­న్నా­యి.

Tags

Next Story