Munawar Faruqui : మునావర్ ఫారూఖీపై ఎలా దాడి చేస్తారో చెప్పిన ఎమ్మెల్యే రాజా సింగ్..

Munawar Faruqui : మునావర్ ఫారూఖీపై ఎలా దాడి చేస్తారో చెప్పిన ఎమ్మెల్యే రాజా సింగ్..
Munawar Faruqui : స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ తెలంగాణ టూర్​ టెన్షన్‌ రేపుతోంది.

Munawar Faruqui : స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ తెలంగాణ టూర్​ టెన్షన్‌ రేపుతోంది. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖీ.. రేపు హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో మునావర్ ఫరూఖీ హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. దీంతో ఆయన్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు.

మునావర్ ఫరూఖీ ఈవెంట్ నిర్వహించే హాల్‌ను తగలబెడతామని ఎమ్మెల్యే రాజాసింగ్‌ వార్నింగ్ ఇచ్చారు. మునావర్ షోకు సంబంధించిన టికెట్లు విక్రయిస్తున్న సంస్థను దగ్దం చేస్తామన్నారు. మునావర్ హైదరాబాద్‌కు వస్తే గనక కొట్టి పంపిస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు రాజాసింగ్. ఫారూఖీ హైదరాబాద్ లో అడుగు పెడితే తాము చేయాల్సింది చేసి తీరుతామని, ఏం జరిగినా సరే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. టికెట్స్‌ కొన్న వాళ్లలో బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారని... ఇప్పటికైనా ఫారుఖీ ఈవెంట్‌ను ఆపేయాలని తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్దకు భారీసంఖ్యలో వెళ్లిన పోలీసులు ఆయన్ని ముందస్తు అరెస్ట్ చేశారు.

అటు ఫారూఖీ షోను నిలిపేయాలంటూ డీజీపీని కలిశారు BJYMనాయకులు. షో జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

మునావర్ ఫారూఖీ డోంగ్రీ టు నోవేర్ పేరుతో స్టాండప్ కామెడీ షోలు నిర్వహిస్తుంటారు. ఈ కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హిందూ సంఘాలు మునావర్‌పై తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. ముఖ్యంగా సీతాదేవిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో మునావర్ షోలను నిషేధించారు.

ఏక్తా కపూర్ నిర్వహించిన క్యాఫ్టివ్ రియాలిటీ షో లాక్ అప్‌లో మునావర్ విజేతగా నిలిచారు. ఆ తరువాత మునావర్ ఫారుఖీకి మంత్రి కేటీఆర్ బహిరంగంగా ఆహ్వానం పలికారు. గత జనవరిలోనే మునావర్ హైదరాబాద్‌లో షో జరపాలని ప్లాన్ చేసినప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. కేసీఆర్‌, కేటీఆర్‌.. హిందూ సమాజాన్ని కామెడీ చేసి పారేస్తున్నారని విమర్శలు గుప్పించారు బీజేపీ నేతలు. అయితే కేటీఆర్ మాత్రం హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం అని, మునావర్ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో షో పేరుతో మునావర్ ఫారూఖీ అడుగుపెడుతుండడంతో రచ్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story