Munawar: శిల్పకళా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్తత.. మునావర్‌ను అడ్డుకునే యత్నం..

Munawar: హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్టాండప్ కమేడియన్ మునావర్‌ను BJYM అడ్డుకునేందుకు యత్నించడంతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. దీంతో ఆందోళన కారుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
అటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ మునావర్ షో కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. బీజేపీ, హిందూ సంఘాల హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అందర్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలికి అనుమతించారు. షోకు వచ్చేవాళ్ల ఆధార్ కార్డుల సమాచారం తీసుకున్నారు. రాత్రి 8 గంటల వరకు మునావర్ షో జరగనుంది.
ఇక తమవాళ్లు ఇప్పటికే శిల్పకళా వేదికలోకి వెళ్లారన్న ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. మునావర్‌పై దాడి తప్పదంటూ రాజాసింగ్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com