అర్ధరాత్రి వేళ క్షుద్రపూజలు.. తీవ్రభయాందోళనలో స్థానికులు

అర్ధరాత్రి వేళ క్షుద్రపూజలు.. తీవ్రభయాందోళనలో స్థానికులు
X
గత 5 రోజులుగా గ్రామపొలిమేరలో రహదారి మద్యలో అర్ద రాత్రివేళ క్షుద్రపూజలు జరుగుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దిబ్బగూడెం గ్రామంలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు తీవ్రభయాందోళనలకు గురవుతున్నారు. గత 5 రోజులుగా గ్రామపొలిమేరలో రహదారి మద్యలో అర్ద రాత్రివేళ క్షుద్రపూజలు జరుగుతున్నాయి.

తెల్లారేసరికి రహదారిపై రక్తం కలిసిన అన్నం ముద్దలు,పసుపు,కుంకుమ,నిమ్మకాయలు, మనిషి ఆకారంలో ముగ్గులు,కొబ్బరి కాయలు,కోడి గుడ్లుతో పాటు కర్రలు,ఎముకలతో బొమ్మలకు తాంత్రికపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయపడిపోతున్నారు.

అధికారులకు తాంత్రికపూజల విషయం చెబితే మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారని వాపోతున్నారు.


Tags

Next Story