నిజామాబాద్ జిల్లాలో జింకల సందడి.. వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడేందుకు ప్రయత్నాలు

నిజామాబాద్ జిల్లాలో జింకల సందడి.. వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడేందుకు ప్రయత్నాలు
2 వేల జింకలు వలస వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో జింకలు సందడి చేస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన వేలాది జింకలు కనువిందు చేస్తున్నాయి. ప్రాజెక్టులో బ్యాక్‌వాటర్ తగ్గిపోవడంతో నీళ్ల కోసం జింకలు అటవీ పరిసరాలు దాటి బయటకు వస్తున్నాయి. గోదావరి, మంజీర పరీవాహక ప్రాంతంల్లోకి దాదాపు 2 వేల జింకలు వలస వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏయా వేసవి కాలంలో శ్రీరామ్‌సాగర్ పరీవాహక ప్రాంతంలోకి జంతువులు, పక్షులు వలస వస్తుండడం సాధారణంగా జరుగుతూనే ఉంటుందని వివరిస్తున్నారు. వలస పక్షులు, జింకలు వేటగాళ్ల ఉచ్చుల్లో పడకుండా వాటిని రక్షించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నట్టు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story