హైదరాబాద్‌లో బోటు నీట మునక.. బోటులో పలువురు చిన్నారులు

హైదరాబాద్‌లో బోటు నీట మునక.. బోటులో పలువురు చిన్నారులు
X

హైదరాబాద్‌లో భారీవర్షం తగ్గి.. 40 గంటలు గడుస్తున్నా.. వరద ముంపు మాత్రం వీడలేదు. ఇంకా వందలాది కాలనీలు మురుగు నీటిలోనే ఉన్నాయి. ఫలక్‌నుమా ఏరియాలో సహాయక చర్యలు నిర్వహిస్తుండగా ఓ బోటు తిరగబడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ చిన్న బోటులో పరిమితికి మించి జనం ఎక్కడంతో అది ఒక్కసారిగా తిరగబడింది. అందులో పలువురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

Tags

Next Story