పండగ పూట విషాదం.. పడవ మునిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతు

X
మంచిర్యాల జిల్లా భీమరం మండల కేంద్రంలో దసర పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. ఆధివారం సాయంత్రం గొల్లవాగు ప్రాజెక్టులోకి నాటు పడవ ద్వారా చేపల వేటకు వెళ్లిన అయిదుగురు వ్యక్తుల్లో ఇద్దరు గల్లంతు కావడంతో గ్రామంలో విషషాద ఛాయలు అలుముకున్నాయి. బొంతల రమేష్,, రాజబాపు,ఇరనేని రమేష్,సంపత్,రవి కలిసి నాటు పడవలో చేపల వేటకు వెళ్లారు. అయితే.. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడడంతో అందరూ ప్రాజెక్ట్ నీళ్లలో మునిగిపోయారు. వీరిలో ముగ్గురికి ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మిగతా ఇద్దరు..బొంతల రమేష్,రాజబాపుఆత్రం గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గత ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెతుకుతున్నారు. గల్లంతైన రమేష్‌కు భార్య ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజబాపుకు భార్య మాత్రమే ఉంది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
