Bomb Threat : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు బెదిరింపు

Bomb Threat : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు బెదిరింపు
అప్రమత్తమైన రైల్వే రక్షక దళం, జిఆర్పీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

సికింద్రాబాద్ బెళగావి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావడంతో రైల్వే సిబ్బంది ఉలిక్కిపడ్డారు. మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరాల్సిన ఎక్స్ ప్రెస్ లో రాత్రి 9.30 గంటలకు బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. అప్రమత్తమైన రైల్వే రక్షక దళం, జిఆర్పీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. రైలులో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. రాత్రి 11.15 గంటల వరకు క్షుణ్ణంగా పరిశీలించి బాంబులేదని తేల్చారు. దీంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బళ్లారి ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో బయలుదేరింది.

Tags

Read MoreRead Less
Next Story