Bonalu 2022: భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు మొదలు.. తొలిబోనం సమర్పణ..

X
Bonalu 2022: భాగ్యనగరంలో ఆషాడమాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి తొలిబోనం ఇవాళ సమర్పించారు. ఘటోత్సవంతో లష్కర్ బోనాలకు అంకురార్పణ జరిగింది. నేటినుంచి 15 రోజులపాటు సికింద్రాబాద్ పురవీధుల్లో అమ్మవారు తిరుగుతూ భక్తులకు దీవెనలు ఇవ్వనున్నారు. ఈనెల 17వ తేదీన ఆదివారం బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు. మరుసటి రోజు రంగం ఉంటుంది. అమ్మవారి ప్రతిరూపంగా భావించే అవివాహిత మహిళ రంగంలో భవిష్య వాణి నినిపిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
