bonalu: బోనమెత్తిన భాగ్యనగరం

bonalu: బోనమెత్తిన భాగ్యనగరం
X

ఆషాఢ మాసం పూర్తి కావస్తుండటంతో భాగ్యనగరంలో బోనాల సంబురాలు అంబరాన్ని తాకాయి. 117 ఏళ్ల చరిత్ర లాల్ దర్వాజాలో అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఉదయం నుంచే ఆలయం భక్తజనంతో కిటకిటలాడింది.


రాజకీయ, సినీ ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.


రాజకీయ నేతలు అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, రీమిక్స్ పాటలతో లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. రాజకీయ నేతలు పోతురాజులతో కలిసి చిందేశారు.

Tags

Next Story