Hyderabad: బోనాల సంబరాలు షురూ..

హైదరబాబ్ నగరంలో బోనాల సంబరాలు మొదలయ్యాయి. నేడు గోల్కొండ జగదంబిక అమ్మవారికి బోనం సమర్పణతో పండగ మొదలవుతుంది. నెల రోజుల పాటు నగరంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుది. నేడు మొదలయ్యే బోనాలు.. జులై 17న ముగుస్తాయి. ఈ బోనాల ఉత్సవాలు గోల్కొండ జగదంబిక ఆలయం, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, లాల్ దర్వాజా సింహవాహిని, ఉప్పుగూడ, మీరాలం మండి, బల్కంపేట్ యల్లమ్మ ఆలయం, సుల్తాన్ షాహిలోని జగదంబిక ఆలయం, శాలిబండ గౌలిపురా బంగారు మైసమ్మ, చందూలాల్ బేలా ముత్యాలమ్మ గుడి.. ఇలా తెలంగాణ వ్యాప్తంగా వీధి వీధిలో ఘనంగా నిర్వహిస్తారు.
మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు బోనాల పండుగ కేంద్ర బిందువు. ఈ పండుగలతో పాటు ఉత్సవాలు, జాతరలు, దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను మరిపించి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. తెలంగాణ ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించే బోనాలు కూడా అలాంటి తేజస్సును తెచ్చిపెట్టేవే. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆ సమయంలో దేవిని దర్శించుకుని తమ సొంత కూతురిగానే భావిస్తూ భక్తిశ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా ఆహారం అర్పించడాన్ని ఊరడి అంటారు. ఈ ఊరడే తర్వాతి కాలంలో బోనంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com