భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై వీడని సందిగ్ధత

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సందిగ్ధత తొలగలేదు. గురువారం కూడా విచారణ కొనసాగించిన సెషన్స్ కోర్టు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఆమెకు బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్నారు.
అఖిలప్రియ పోలీసుల విచారణకు సహకరిస్తారని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. మరోవైపు ఈ కేసులో భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్‌రెడ్డిల ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా సికింద్రాబాద్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
ఈ పిటిషన్లపైనా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇతర నిందితులైన మల్లికార్జున్‌రెడ్డి, బోయ సంపత్‌లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com