Breaking News : రామంతపూర్ గోదాంలో అగ్నిప్రమాదం

Breaking News : రామంతపూర్ గోదాంలో అగ్నిప్రమాదం
X
శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో గోదాం పూర్తిగా కాలిపోయింది

ఫ్లైవుడ్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని రామంతపూర్ లో జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో గోదాం పూర్తిగా కాలిపోయింది. ఉదయం 7.30గంటలకు గోదాం సిబ్బంది మంటలను గమనించారు. వెంటనే ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.


మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మంటలు అంటుకుని చాలాసేపయినప్పటికీ అగ్ని కీలలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయానికి గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావంతో ఊపిరిపీల్చుకున్నారు. ఘటనా స్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story