Breaking News : అపార్ట్ మెంట్ పైనుంచి పడి కార్మికుడి మృతి

Breaking News : అపార్ట్ మెంట్ పైనుంచి పడి కార్మికుడి మృతి
ఈ ఘటన హైదరాబాద్‌ లోని చింతల్‌ లో చోటు చేసుకుంది

నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌ లోని చింతల్‌ చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న స్టార్‌ లైట్ అపార్ట్ మెంట్ ఐదవ అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి శంకర్ భుక్తి అనే కార్మికుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఒరిస్సాకు చెందిన కార్మికుడిగా గుర్తించారు. ఇక ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు లేకుండా బిల్డింగ్‌ నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

Tags

Next Story