REVANTH: రేవంత్‌రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధాని లేఖ

REVANTH: రేవంత్‌రెడ్డికి  బ్రిటన్ మాజీ ప్రధాని లేఖ
X
విద్యా శాఖపై సీఎం రేవంత్ సమీక్ష

తె­లం­గాణ సీఎం రే­వం­త్‌ రె­డ్డి­కి బ్రి­ట­న్‌ మాజీ ప్ర­ధా­ని టోనీ బ్లె­యి­ర్‌ లేఖ రా­శా­రు. తె­లం­గాణ రై­జిం­గ్‌-2047ను ఆ లే­ఖ­లో ప్ర­శం­సిం­చా­రు. ఇటీ­వల ఢి­ల్లీ పర్య­టన సం­ద­ర్భం­గా టోనీ బ్లె­యి­ర్‌­తో సమా­వే­శ­మైన సీఎం రే­వం­త్ రె­డ్డి.. తె­లం­గాణ రై­జిం­గ్‌ వి­జ­న్‌ 2047గు­రిం­చి ఆయ­న­కు వి­వ­రిం­చా­రు. పె­ట్టు­బ­డు­లు, ఐటీ, ట్రి­లి­య­న్ డా­ల­ర్ల ఎకా­న­మీ­లో లక్ష్యాల గు­రిం­చి టోనీ బ్లె­యి­ర్‌­తో రే­వం­త్‌­రె­డ్డి చర్చిం­చా­రు. ఈ నే­ప­థ్యం­లో టోనీ బ్లె­యి­ర్‌ ఇన్‌­స్టి­ట్యూ­ట్‌ ఆఫ్‌ గ్లో­బ­ల్‌ ఛేం­జ్‌, తె­లం­గాణ మధ్య అవ­గా­హన ఒప్పం­దం కు­ద­ర­గా.. రై­జిం­గ్‌ వి­జ­న్‌ రూ­ప­క­ల్పన, అమ­లు­కు లె­ట­ర్‌ ఆఫ్‌ ఇం­టెం­ట్‌­ను ఇరు­వై­పుల ప్ర­తి­ని­ధు­లు మా­ర్చు­కు­న్నా­రు. ఈ నే­ప­థ్యం­లో తె­లం­గాణ రై­జిం­గ్‌ 2047 తనను ఆక­ట్టు­కుం­దం­టూ సీఎం రే­వం­త్ రె­డ్డి­ని అభి­నం­దిం­చిన టోనీ బ్లె­యి­ర్‌.. ఈ వి­జ­న్‌­కు సహ­క­రి­స్తా­మ­ని తె­లి­పా­రు. మరో­వై­పు పట్ట­ణా­ల్లో, నగ­రా­ల్లో అసం­పూ­ర్తి పను­ల­ను త్వ­ర­గా పూ­ర్తి చే­యా­ల­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. హై­ద­రా­బా­ద్‌­లో శా­ని­టే­ష­న్‌, నీరు, డ్రై­నే­జీ వ్య­వ­స్థ­పై శ్ర­ద్ధ వహిం­చా­ల­న్నా­రు. రో­డ్ల­పై నీరు ని­లి­చే చోట ముం­ద­స్తు చర్య­లు తీ­సు­కో­వా­ల­ని సూ­చిం­చా­రు.

సీఎం రే­వం­త్ రె­డ్డి వి­ద్యా శా­ఖ­పై సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా వి­ద్యా వ్య­‌­వ­‌­స్థ­‌­ను మ‌­రింత ప‌­టి­ష్టం చే­యా­ల­ని సూ­చిం­చా­రు. జి­ల్లా­ల్లో­ని ఐఏ­ఎ­స్ అధి­కా­రు­లు వా­రా­ని­కి రెం­డు పా­ఠ­‌­శా­ల­‌­ల­‌­ను సం­ద­‌­ర్శిం­చా­ల­ని, పా­ఠ­‌­శా­ల­‌­ల్లో అవ­‌­స­‌­ర­‌­మైన మేర నూతన గ‌­దు­లు ని­ర్మిం­చా­ల­ని ఆదే­శిం­చా­రు. పా­ఠ­‌­శా­ల­‌­ల్లో సో­లా­ర్ కి­చె­న్లు ఏర్పా­టు చే­యా­ల­న్నా­రు.

తెలంగాణ మెట్రో ప్రస్తావన లేదు: మంత్రి

కేం­ద్ర కే­బి­నె­ట్‌ సమా­వే­శం­లో తె­లం­గాణ మె­ట్రో ప్ర­స్తా­వన లే­ద­ని మం­త్రి శ్రీ­ధ­ర్‌­బా­బు అస­హ­నం వ్య­క్తం చే­శా­రు. మహా­రా­ష్ట్ర, పూణె మె­ట్రో­కు కేం­ద్రం సె­కం­డ్‌ ఫే­జ్‌ కే­టా­యిం­చిం­ద­ని తె­లి­పా­రు. కానీ తె­లం­గాణ మె­ట్రో వి­స్త­ర­ణ­పై కేం­ద్రం ని­ర్ణ­యం తీ­సు­కో­క­పో­వ­డం బా­ధా­క­ర­మ­ని వె­ల్ల­డిం­చా­రు. మె­ట్రో సె­కం­డ్‌ ఫే­జ్‌ ప్ర­తి­పా­ద­న­ను కేం­ద్రం వెం­ట­నే ఆమో­దిం­చా­ల­ని మం­త్రి డి­మాం­డ్ చే­శా­రు. తె­లం­గాణ ప్ర­భు­త్వం ఎన్ని ప్ర­తి­పా­ద­న­లు పం­పి­నా కేం­ద్ర ప్ర­భు­త్వం సరైన సహ­కా­రం అం­దిం­చ­డం లే­ద­ని మం­త్రి అన్నా­రు.

Tags

Next Story