Kamareddy: కామారెడ్డిలో విషాదం.. తోడబుట్టినవాడి మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వని అన్నదమ్ములు..

Kamareddy: కామారెడ్డిలో విషాదం.. తోడబుట్టినవాడి మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వని అన్నదమ్ములు..
Kamareddy: తోడబుట్టినవాడు చనిపోతే కనీసం మృతదేహాన్ని కూడా ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు అన్నదమ్ములు.

Kamareddy: మనిషిలో మానవత్వం మాయం అవుతుందా అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. తోడబుట్టినవాడు చనిపోతే కనీసం మృతదేహాన్ని కూడా ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు అన్నదమ్ములు. కామారెడ్డిలోని అయ్యప్పనగర్‌ కాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గత శనివారం సంజీవ్‌ అనే వ్యక్తి రైలు కింద పడి చనిపోయాడు.

అయితే, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉండడంతో.. సంజీవ్ మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదని మృతుని భార్య కల్పన ఆరోపించింది. అసలు తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అన్నదమ్ములైన శ్రీనివాస్, కిరణ్‌లే హత్య చేశారని ఆరోపించింది. సంజీవ్‌ 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని, ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

పెళ్లి తరువాత కామారెడ్డిలోనే హనుమాన్‌ మందిర్‌ సమీపంలో ఉంటూ, బావర్చి రెస్టారెంట్‌లో పనిచేస్తూ, కుటుంబాన్ని పోషించుకున్నాడు. అయితే, తనకు వాటాగా రావాల్సిన ఆస్తి కోసం అన్నదమ్ముల దగ్గరికొచ్చి అడుగుతుండే వాడు. ఆ సమయంలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య గొడవలయ్యాయి. తండ్రి రాజేశం సైతం తనకు ఇద్దరు కొడుకులే ఉన్నారంటూ శ్రీనివాస్‌, కిరణ్‌లకే ఆస్తి రాసిచ్చాడు. అప్పటి నుంచి సంజీవ్ మానసిక వేదనతోనే కాలం గడిపాడు.

ఉన్నట్టుండి గత శనివారం సంజీవ్‌ రైలు కింద పడి చనిపోయాడు. పోస్టుమార్టం తరువాత సంజీవ్ మృతదేహాన్ని అన్నదమ్ముల ఇంటికే తీసుకొచ్చింది భార్య కల్పన. కాని, ఇంట్లో వాళ్లు అడ్డుకుని, శవాన్ని ఇంటి పరిసరాల్లోకి కూడా రానివ్వలేదు. దీంతో భర్త మృతదేహంతో కొన్ని గంటల పాటు అక్కడే వేచి చూసింది. చివరికి పోలీసులు కలగజేసుకుని, పెద్దలను పిలిపించి అంత్యక్రియలు చేసేలా చూడాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story